సీక్వెల్ తో  ‘హిట్’ కొడతాడా ?

69
- Advertisement -

మేజర్ తర్వాత అడివి శేష్ నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’ . ఈ సినిమాతో డిసెంబర్ 2న థియేటర్స్ లోకి రానున్నాడు. ఇటివల మేజర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన శేష్ కి ‘హిట్ 2’ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. క్షణం , గూడచారి, మేజర్ ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ తో ఓ బ్రిడ్జ్ కట్టుకున్నాడు శేష్. ఆ సినిమాలకు శేష్ రైటర్ గా కూడా వర్క్ చేశాడు. స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి పనితనం చూపించి మెప్పించాడు.

ఇక హిట్2 కి కేవలం హీరోగా మాత్రమే వర్క్ చేశాడు. శేష్ ఎంట్రీ ఇవ్వకముందే హిట్2 స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాకు సీక్వెల్ కావడంతో శేష్ దర్శకుడికి ఫుల్ ఫ్రీడం ఇచ్చేశాడు. పైగా నాని ఈ సినిమాకు ఓ నిర్మాత కాబట్టి ఈసారి నేచురల్ స్టార్ మీద భరోసా పెట్టాడు. అలాగే దర్శకుడు హిట్ తో హిట్ కొట్టాడు కాబట్టి శేష్ కేవలం తనకున్న ప్రశ్నలు మాత్రమే అడిగాడాని తనని కన్విన్స్ చేయడానికి టైం పట్టేదని తెలిపాడు. టీజర్ , ట్రెయిలర్ క్లిక్ అయ్యాయి. హిట్ తో విశ్వక్ సేన్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్ వంతు ఈ క్రైం థ్రిల్లర్ తో కుర్ర హీరో ఎలాంటి హిట్ కొడతాడా ? అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

‘రష్మిక’ మిగిలిన వారికంటే స్పెషల్

ప్చ్.. ఇలా పెంచేస్తే ఎలా అమ్మడు ?

ఎన్టీఆర్ కు ఇద్దరు.. ఓ ఐటమ్ కూడా !

- Advertisement -