రామమందిరం విరాళాల దుర్వినియోగంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు.
రామమందిరం విరాళాల కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని అయోధ్యను గానీ, రాముని భక్తులను గానీ లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. అయోధ్యపై కన్నేయకండి. రాముని భక్తుల సహనాన్ని పరీక్షించవద్దు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్ (SIT) ముందు ఉంచండి అని విచారణ తీరును ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఆయన తేల్చి చెప్పారు.
Also Read:కేంద్రమంత్రికి CJP బర్త్ డే గిఫ్ట్!
రామమందిర విరాళాలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఎస్ఐటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

