- Advertisement -
మెడికల్ టెక్నాలజీకి హబ్‌గా తెలంగాణ మారుతోంది. సంగారెడ్డి జిల్లా, సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజెస్ పార్కులో నెలకొల్పిన ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ) స్టెంట్ల ఉత్పత్తి మరియు ఆర్&డి ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
రూ.250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసింది సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్. ఈ యూనిట్‌లో సంవత్సరానికి 12 లక్షల 50 వేల స్టెంట్లు తయారు చేయనున్నారు. 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టెంట్ల తయారీ పరిశ్రమలో ఏడాదికి 2200 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. భారత స్టెంట్ మార్కెట్‌లో సహజానంద్ కంపెనీకి 30 శాతానికిపైగా మార్కెట్ వాటా ఉంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సహజానంద్ కంపెనీ ప్రపంచంలోని 70 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
- Advertisement -