విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..?

30
yashwwanth sinha
- Advertisement -

రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంది. విపక్షాల అభ్యర్థిగా పలువురి పేర్లు తెరమీదకు రాగా వారు తప్పుకున్నట్లు చెప్పగా తాజాగా టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. శరద్ పవార్ తో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రపుల్ పటేల్, జైరామ్ రమేష్, సీతారాం ఏచూరి, డి. రాజాలు భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని యశ్వంత్ సిన్హా స్వయంగా ట్వీటర్ వేదికగా వెల్లడించారు.

జాతీయ ప్రయోజనాలకోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన సమయం తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి యశ్వంత్ సిన్హా కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -