జయశంకర్ సార్‌… మహానీయుడు!

25
ts
- Advertisement -

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు మంత్రి జగదీష్‌ రెడ్డి. పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ చౌరస్తా లో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు హరీష్ రావు. జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని అన్నారు.

విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, ప్రొఫెసర్ గా కెసిఆర్ కి ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -