- Advertisement -
కరోనా కారణంగా యాదాద్రి ఆలయంలో భక్తులకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యపూజలను మాత్రం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవలు నిర్వహించి స్వామివారికి అభిషేకంతో ప్రార్ధనలు చేశారు అర్చకులు. ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి, శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతును జరిపారు. రాత్రి ఏడు గంటలకు ఆరగింపు తదుపరి పవళింపు సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు.
- Advertisement -