మరో రీమేక్ మూవీలో సమంత..?

402
samantha
- Advertisement -

వరుస సినిమాలతో దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. రీమేక్ సినిమాల్లో నటిస్తూ నటిగా మంచిగుర్తింపు తెచ్చుకున్న సామ్ తాజాగా మరోసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా కన్నడ చిత్రం దియాను తెలుగులో రీమేక్ చేయనుండగా ఇందులో నటించేందుకు సమంత ఓకే చెప్పినట్లు సమాచారం. కన్నడ లో మంచి విజయాన్ని అందుకున్నఈ సినిమా కథ నచ్చడంతో సామ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ అమ్మాయి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇక ఇప్పటికే ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘జాను’ వంటి రీమేక్ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్..దియాతో కూడా అదరగొట్టడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

- Advertisement -