బాహుబలి ట్రైలర్‌కే అన్ని కోట్లా..!!

188
Writer Vijayendraprasad about baahubali2
- Advertisement -

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి2 విడుదలైంది. బాహుబలి 1 కన్నా బాహుబలి 2 బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. రాజమౌళీ అద్బుతాన్ని సృష్టించారని.. ఇంకో 25 ఏళ్ల వరకు బాహుబలిని మించిన సినిమా తెలుగులో రాదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే బాహుబలి 1,2 లకు మూల కారణం… దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. కథ రచయితగా ఆయనకు మంచి పేరుంది. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్‌ సినిమా ఎంత హిట్టైందో తెలిసిన సంగతే. ఈ కథకు మూలం కూడా విజయేంద్ర ప్రసాదే. బాహుబలి టీం ఐదేళ్ల శ్రమ ఫలితం నేడు థియేటర్లలో కనిపిస్తుంటే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

vijayendra-prasad

ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారాయన. ఎక్కడైనా సినిమాకు డబ్బులు ఖర్చు పెడతారని.. కానీ.. బాహుబలి ఫస్ట్ హాప్ అనే ట్రైలర్ కు జనాలు డబ్బులు పెట్టి చూశారన్నారు. ఏదైనా సినిమా ప్రచారం కోసం.. సినిమా ట్రైలర్‌కు నిర్మాత డబ్బులు ఖర్చు చేస్తారన్నారు. బాహుబలి: ది బిగినింగ్‌ అనేది సినిమా కాదని.. బాహుబలి: ది కన్‌క్లూజన్‌కు ట్రైలర్‌ లాంటిదన్నారు. రెండో భాగమే అసలైన కథ అని.. అందులోని క్యారెక్టర్లను పరిచయం చేయటానికి మొదటి భాగమన్నారు. ఏమైనా.. ట్రైలర్ కోసం వందల కోట్లు ఖర్చు చేయటం.. ఆ రెండున్నర గంటల ట్రైలర్ ను ప్రజలు విశేషంగా ఆదరించారని.. ఇది ఒక రికార్డుగా అభివర్ణించారు విజయేంద్రప్రసాద్.

- Advertisement -