పతకాలను గంగలో కలిపేస్తాము..బజరంగ్‌

38
- Advertisement -

న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్‌ తాజాగా ఓ ప్రకటన చేశారు. నేటి సాయంత్రం హరిద్వార్‌లోని గంగానదిలో తాము సాధించిన పతకాలను కలుపుతామని ప్రకటించారు. అనంతరం ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరహర దీక్ష చేస్తామని హెచ్చరించారు. భారత రెజ్లర్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

మే28న జరిగిన పరిణామాలను అందరూ చూశారు. శాంతి పూర్వకంగా నిరసన చేపడుతున్న మాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పైగా మాపైనే కేసులు వేశారు. మహిళా క్రీడాకారులు న్యాయం కోరడం తప్పా? దేశం తరపున తాము పతకాలు ఎందుకు సాధించామా అని అనిపిస్తోంది. ఇప్పడు వాటికి ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడమంటే మాకు మరణంతో సమానం. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కష్టం. అందుకే రాష్ట్రపతి ప్రధానికి తిరిగి ఇచ్చేద్దామన్నా…మాకు మనసు ఒప్పుకోవడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం హరిద్వార్‌లో గంగా నదిలో వాటిని కలిపేయనున్నాం. ఈ పతకాలే మా ప్రాణం..ఆత్మ. అందుకే…వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహర దీక్షకు దిగుతాం అని బజరంగ్ పునియా ట్వీట్ చేశారు.

Also Read: IPL 2023:ఎవరికి ఎంత ప్రైజ్‌మనీ అంటే?

- Advertisement -