ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలు దాటిన మరణాలు..!

166
covid
- Advertisement -

కరోనా విలయతాండవంతో ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. వివిధ దేశాల ఆర్ధిక పరిస్ధితి కుచించడమే కాదు లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తాజాగా రాయ్ టర్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 40 లక్షలకు పైగా మృతిచెందినట్లు వెల్లడించింది.

మొద‌టి 20 ల‌క్ష‌ల మర‌ణాలు న‌మోద‌వ‌డానికి ఏడాది కాలం ప‌డితే, మ‌రో 20 ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌కు కేవ‌లం 166 రోజులు మాత్ర‌మే ప‌ట్టింద‌ని అధ్య‌యనం పేర్కొంది. అత్యధికంగా అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌, ర‌ష్యా, మెక్సికో దేశాల్లో కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల్లో ఈ ఐదు దేశాల్లోనే 50 శాతం ఉన్నాయంటే మ‌హ‌మ్మారి ఎంతలా విల‌యం సృష్టించిందో అర్థంచేసుకోవ‌చ్చు. పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిప‌బ్లిక్‌, జిబ్రాల్ట‌ర్ వంటి చిన్న‌ దేశాల్లో మ‌ర‌ణాల రేటు అత్య‌ధికంగా ఉంద‌ని వెల్ల‌డించింది.

- Advertisement -