శేఖర్ కమ్ముల దర్శఖత్వంలో పాన్‌ ఇండియా చిత్రం.!

100
shekar kammula

తనదైన మేకింగ్ అండ్ టేకింగ్‌తో టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. క్లాస్‌ మూవీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న శేఖర్ కమ్ముల…ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా చేస్తుండగా తాజాగా పాన్ ఇండియా మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఏషియన్ సినిమాస్ శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా చేయనున్నాడని టాక్‌. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. పలువురు దర్శకులు పాన్ ఇండియన్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు బాక్సాఫీస్‌ను సైతం కొల్లగొట్టారు.