తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం, ఇప్పటి తరాన్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడమనే రెండు ప్రధాన లక్ష్యాలుగా ప్రపంచ తెలుగు మహాసభలు మహాసభలు జరగనున్నాయి. డిసెంబర్ 15–19 వరకు జరగనున్న ఈ మహాసభలకు ప్రపంచదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలుగు మహాసభలలో ఎన్నారైలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సన్నాహక సదస్సులో మాట్లాడిన మహేష్ ప్రవాస తెలుగు సాహితీవేత్తలను, కవులను, మరియు సంగీత, నృత్య, జానపద కళాకారులకు అవగహన కలిపించి ఆహ్వానం పలికారు. ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో చాల గొప్పగా నిర్వహించబోతున్నదని తెలిపారు. మహాసభల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి కోవింద్ ముఖ్యఅతిథిగా రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక్ రెడ్డి ,సతీష్ , రాజు, శ్రీకాంత్, వంశితో పాటు తదితరులు పాల్గొన్నారు.