RamKiBandi:వరల్డ్ ఫేమస్ రామ్‌ కీ బండి

45
- Advertisement -

నేటీ అధునిక కాలంలో చదువు కేవలం గొప్పగా కనిపించిన కనిపించకుండా మనలో దాగిన ఆలోచనతో కొత్తగా ముందుకు సాగితే అందులో వచ్చే తృప్తి ఇంకా ఎందులో ఉండదు. ఉద్యోగం చేస్తే నెలకు రూ.10వేలు లేదా మహాయితే అత్యధికంగా రూ.50వేలు ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే బలవంతంగా బయటికి పంపే ప్రయత్నాలు చేసే సంస్థలు కూడా  ఉంటాయి. అలాంటిది ఒక వ్యక్తి తను నమ్ముకున్న పనిని ఇష్టంగా చేస్తే అందులో ఉండే కష్టనష్టాలను ఎదురొడ్డి నిలబడితే వరల్డ్ ఫేమస్ అయిపోరు..అలాంటి వారే మన రామ్‌కీ బండి ఓనర్‌ రామ్‌.

రామ్‌ ఫాదర్‌ లక్షణరావు షిండే..సైన్యంలో చేరేందుకు ఆసక్తితో కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు 1989లో ట్రైన్‌ ఎక్కేశారు. కానీ సైన్యంలో చేరాలనే కల కలగానే మిగలడంతో నిరాశ చెందారు. అయితే ఉత్త చేతులతో ఊరెళ్లడం ఇష్టం లేక బండి మీద టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉపాధి పొందేవారు. నాంపల్లి పంజాగుట్ట అమీర్ పేట్‌ ఇలా వేర్వేరు చోట్ల రోజంతా బండిమీద తిరుగుతూ ఇడ్లీ డోసే అమ్మేవారు. లక్ష్మణరావుకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉండేవాళ్లు. వారంత కేవలం రూ.20అద్దె చెల్లించి చిన్న గదిలో జీవనం కొనసాగించారు.

తండ్రి పడే కష్టం చూసి వారిని ఉన్నతంగా జీవించాలని కలలు కన్న రామ్‌… కష్టపడి ఎంబీఏ పూర్తి చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటే తెలిసింది. తక్కువ జీతానికి ఎక్కువ పని… అదిగాక తమ టిఫిన్ బండి దగ్గర పనిచేసే వంట మాస్టర్లకే నెలకు రూ.20-30వేలు ఇస్తుంటే…నేనోమో తక్కువ జీతానికి జాబ్ చేయాలా అనే ఆలోచన రావడంతో ఒక్కసారిగా తన జీవితం మారి పోయింది… రామ్‌కీ బండి.

రామ్ తండ్రిని బలవంతంగా ఒప్పించి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అలా 2010 నుంచి టిఫిన్ బండి నిర్వహణ బాధ్యతలను మొత్తం తనై చూసుకున్నారు. ఇలా అందరూ వేసిన ఇడ్లీలు దోసేలు కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఎదైనా చేద్దామనుకొని ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. అయితే తండ్రి లక్ష్మణరావు సలహాతో తను ఇంకా త్వరగా నేర్చుకొని మంచి శాకాహార నిపుణుడిగా ఎదిగారు. అనతి కాలంలోనే రామ్‌కీ బండి వద్ద ప్రత్యేకమైన టిఫిన్‌లు మెన్‌లోకి వచ్చేశాయి.

బటర్‌, చీజ్‌, పనీర్‌, చీజ్‌ స్వీట్‌ కార్న్‌, పిజ్జా, షెజ్వాన్‌… ఇలా ఓ డజనుకుపైగా రకాల్లో దోసెలూ… బటర్‌ కార్న్‌, చీజ్‌, తవా ఫ్రై… ఇలా ఓ అరడజను రకాల్లో ఇడ్లీలూ అక్కడ దొరుకుతాయి. దాంతో ‘రామ్‌ కీ బండి’ దగ్గరకు చాలా బళ్లూ, కార్లూ ఆగడం మొదలైంది. కస్టమర్ల సలహాలూ, సూచనలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నవాటిని మెరుగుపర్చుకుంటూ కొత్త రుచుల్నీ చేర్చాడు. అదే సమయంలో నగరంలో నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లూ, రాత్రిళ్లు ప్రయాణం చేసేవాళ్లకు అనుకూలంగా ఉంటుందని తన బండిని తెల్లవారు జామున మూడింటికే తెరవడం మొదలుపెట్టాడు. దాంతో రామ్‌కీ బండి దగ్గర రుచి సమయం అనుకులంగా ఉండటంతో కేవలం ఐదు నిమిషాల్లో యాబై దోసెలు అమ్ముడైపోతాయి. దోసె ధరలు రూ.50 నుంచి 200మధ్య ఉంటాయి. అంతేకాదు ఈ దోసెలకు దాసోహమైన సచిన్ హర్ష్‌ లాంటి వాళ్లు పెట్టుబడికి పెట్టేందుకు ముందుకు రావడంతో దీన్ని శాఖలు చెట్టు కొమ్మల మాదిరిగా విస్తరించాయి.

బేగం బజార్, బేగంపేట్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో రామ్‌కీ బండి ఔట్‌లెట్లు తెరిచారు. అంతేకాదు బంజారాహిల్స్‌లో రామ్స్ దోసె హౌజ్‌ ఏర్పాటు చేసి అనతి కాలంలో లాభాల బాట పట్టించారు. ఈ మధ్యే హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. కానీ రామ్‌ మాత్రం తన మాతృ సంస్థైన నాంపల్లి బండి దగ్గరే ఎక్కువ సమయం గడిపి మిగిలిన సమయాల్లో మిగతా ఔట్‌లెట్లని పర్యవేక్షిస్తారు. ఒక వ్యక్తి యొక్క ఆలోచన తనని ఎంత ఫేమస్‌ చేసిందో చదివారా…ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. ఆలోచనతో ముందుకు సాగితే ఎంతటి పని అయిన చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. అలాగే ఇట్టే ఆ కష్టాలు తీరిపోతాయి కూడా.

ఇవి కూడా చదవండి…

MMTS:ఏప్రిల్‌ 8..రెండో దశ ఎంఎంటీఎస్‌ను ప్రారంభించనున్న పీఎం..!

Fish Oil:చేపనూనె తీసుకుంటే ఎన్ని ఉపయోగాలో..!

Fact Check:అవన్నీ ఫేక్ వార్తలే

- Advertisement -