విజయ్ వల్లే సినిమా ప్లాప్ అయ్యింది

425
world famous lover
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఈనెల 14న విడుదలైన సంగతి తెలిసింద. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై నిర్మించారు. భారీ అంచానాలతో విడుదలైన ఈమూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. విజయ్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ మూవీగా మూటగట్టుకుంది.

ఇక ఈచిత్రం పరాజయం కావడానికి ముఖ్య కారణం విజయ్ దేవరకొండ అని అంటున్నాడు దర్శకుడు క్రాంతి మాధవ్. విజయ్ దేవరకొండ అతిగా కల్పించుకోవడమే కారణమని, సినిమా షూటింగ్ మొదలయ్యాక కథలో కల్పించుకోవడంతో పాటు ఎన్నో సన్నివేశాలను రీషూట్ చేయించాడని, ఫలితంగానే తాను అనుకున్న స్క్రిప్ట్ తప్పిందని దర్శకుడు క్రాంతి మాధవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడట. దర్శకుడిగా తనకు స్వేచ్ఛ లేకుండా చేసినందువల్లే సినిమా ఫలితం ఇలా వచ్చిందని తన సన్నిహితుల వద్ద వాపోయాడట దర్శకుడు క్రాంతి.

- Advertisement -