వెండితెరపై సామ్…నేటితో పదేళ్లు

145
samantha

టాలీవుడ్‌లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అగ్ర హీరోయిన్లలో ఒకరు సమంత. 2010లో ఏం మాయ చేశావే చిత్రంతో వెండితెర ఆరగేట్రం చేసిన ఈ బ్యూటీ తర్వాత వరుస ఆఫర్లతో అనతికాలంలో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది.

ఇక సమంత ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో పది సంవత్సరాలు పూర్తయింది. తొలి సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సామ్‌… అక్కినేని కోడలిగా పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రంగస్ధలంలో రామలక్ష్మీగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సామ్… యూటర్న్ చిత్రంలో తన నటనతో కట్టిపడేసింది.

ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోయిన్‌ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్ళు కావొస్తుండ‌డంతో ఈ మూమెంట్‌ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో సమంత సినిమాల‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేయ‌డంతో పాటు ఆమె సినిమాల‌లోని స్టిల్స్ కొన్ని పోస్ట్ చేస్తున్నారు. వీటిని షేర్ చేస్తూ తనపై అభిమానులకు థ్యాంక్స్ చెబుతోంది సామ్.