RRRకు వరల్డ్ బ్యాంకు అప్పు!

4
- Advertisement -

రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర రహదారుల అభివృద్ధికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచే అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి మొదలై చౌటుప్పల్ వరకు దాదాపు 162 కి.మీ ఉండే ఈ రహదారి నిర్మాణానికి రూ.14-16 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటికు రూ.4,944 కోట్ల అప్పు ఇవ్వండి అంటూ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ట్రామాకేర్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు మరియు ఇతర అంశాలకు రూ.4,944 కోట్ల రుణం కావాలని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read:ప్రకాశ్‌ రాజ్‌, కార్తీపై పవన్ సీరియస్

- Advertisement -