ఆసీస్‌పై భారత్‌ భారీ విజయం..

226
India Women Vs Australia Women
- Advertisement -

ఆసిస్‌తో కఠిన సవాల్‌ ఎదురవుతుందని అనుకున్న టీంఇండియా ఈసారి ఆల్‌రౌండ్‌ ప్రతిభతో చెలరేగింది. ముందుగా స్మృతి మంధాన (55 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 83), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ఆ తర్వాత స్పిన్నర్ల ధాటికి ఆసీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో 48 పరుగుల తేడాతో భారత్‌ నెగ్గింది. స్పిన్నర్లు అనూజకు మూడు.. దీప్తి, రాధ, పూనమ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆసీస్‌పై హర్మన్‌ప్రీత్‌ సేనకు ఇదే అత్యధిక స్కోరు. ఎలిస్‌ పెర్రీకి 3వికెట్లు దక్కాయి. భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. ఎలిస్‌ పెర్రీ (39 నాటౌట్‌) ఆఖర్లో బౌండరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్మృతి నిలిచింది.

India Women Vs Australia Women

భారత్‌ ఇన్నింగ్స్‌: తానియా భాటియా (సి) లానింగ్‌ (బి) గార్డెనర్‌ 2; మంధాన (సి) పెర్రీ (బి) షట్‌ 83; జెమిమా (సి) విలాని (బి) కిమిన్స్‌ 6; హర్మన్‌ప్రీత్‌ (సి) హేన్స్‌ (బి) కిమిన్స్‌ 43; వేద (సి) వ్లామింక్‌ (బి) గార్డెనర్‌ 3; హేమలత (బి) పెర్రీ 1; దీప్తిశర్మ (బి) పెర్రీ 8; అరుంధతిరెడ్డి (సి) బోల్టన్‌ (బి) పెర్రీ 6; రాధ యాదవ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14 మొతŸ్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167
వికెట్ల పతనం: 1-5, 2-49, 3-117, 4-131, 5-136, 6-154, 7-166, 8-167
బౌలింగ్‌: వ్లామింక్‌ 2-0-9-0; గార్డెనర్‌ 3-0-25-2; షట్‌ 4-0-30-1; మోలినిక్స్‌ 4-0-45-0; కిమిన్స్‌ 4-0-42-2; పెర్రీ 3-0-16-3

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: మూనీ (బి) దీప్తి 19; విలాని (సి) వేద (బి) దీప్తి 6; గార్డెనర్‌ (సి) వేద (బి) పూనమ్‌ 20; లానింగ్‌ (సి) వేద (బి) రాధ 10; హేన్స్‌ (స్టంప్డ్‌) తానియా (బి) పూనమ్‌ 39; పెర్రీ నాటౌట్‌ 39; మోలినిక్స్‌ (సి) వేద (బి) అనూజ 9; కిమిన్స్‌ (సి) అండ్‌ (బి) రాధ 1; షట్‌ (సి) తానియా (బి) అనూజ 4; వ్లామింక్‌ (స్టంప్డ్‌) తానియా (బి) అనూజ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 119
వికెట్ల పతనం: 1-27, 2-27, 3-56, 4-59, 5-90, 6-103, 7-105, 8-118, 9-119;
బౌలింగ్‌: అరుంధతి రెడ్డి 2-0-19-0; అనూజ 3.4-0-15-3; దీప్తి శర్మ 4-0-24-2; రాధ యాదవ్‌ 4-0-13-2; పూనమ్‌ యాదవ్‌ 4-0-28-2; హర్మన్‌ప్రీత్‌ 2-0-19-0

- Advertisement -