మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌కు షాకిచ్చింది న్యూజిలాండ్. పటిష్టమైన భారత జట్టుపై కివీస్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. 261 పరుగుల లక్ష్యంతో బరిలోది దిగిన భారత్….46.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71) మినహా మిగతా బ్యాటర్స్ చేతులెత్తేశారు.
దారుణమైన ఆటతీరుతో అందరిని నిరుత్సాహపర్చారు భారత ఆటగాళ్లు. తొలి 20 ఓవర్లలో జట్టు చేసింది 50/3 స్కోరు మాత్రమే. ఇందులో 85 డాట్ బాల్స్ ఉండడం గమనార్హం.
ఇక తొలుత టాస్ గెలిచిన భారత్…న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత ఓవర్లో కివీస్ 9 వికెట్లు కొల్పోయి 260 పరుగులు చేసింది. శాటర్త్‌వెయిట్ (75), అమెలియా కెర్ (50) అర్ధసెంచరీలు సాధించగా, మార్టిన్ (41), డెవిన్ (35) రాణించారు. భారత్ తన తదుపరి మ్యాచ్ ఈనెల 12న వెస్టిండీస్‌తో తలపడనుంది.