దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ అండర్-19 జట్టు ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9వికెట్లు కోల్పోయి 107రన్స్ చేసింది. భారత బౌలర్లలో ప్రషవి చోప్రా మూడు వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్‌ను కట్టడి చేశారు.
108పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.2ఓవర్లో మ్యాచ్‌ను ముగించి…కివీస్‌ను ఇంటికి పంపించింది. భారత బ్యాటింగ్‌లో శ్వేతా సెహ్రావత్(61) రాణించింది. సౌమ్యా తివారీ (22), షెఫాలీ వర్మ (10) మాత్రమే పరుగులు చేశారు. నేడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది.
టీమిండియా రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్‌లో ఆడనుంది. అండర్-19 తొలిసారి నిర్వహిస్తున్న వేళ భారత్ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తుంది. ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరుగుతుంది. ఫైనల్‌కు అండర్-19 జట్టు ఒక అడుగు దూరంలో ఉంది.
ఇవి కూడా చదవండి…