లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!

6
- Advertisement -

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభలో వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణకు అవసరమైన రెండొంతుల (2/3) మెజారిటీ లభించకపోవడంతో ఈ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. దీనితో పాటు దీనికి అనుబంధంగా ఉన్న ‘డీలిమిటేషన్ బిల్లు 2026’, ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026’ కూడా నిలిచిపోయాయి.

బిల్లు వీగిపోవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న రెండు కీలక బిల్లులు కూడా నిలిచిపోయాయి. అయినప్పటికీ, మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం తన పోరాటాన్ని కొనసాగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ.. ఇది దేశంలోని సగం జనాభాకు జరిగిన ఓటమి అని, ప్రతిపక్షాలను మహిళలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాన్ని ప్రతిపక్షాల భారీ విజయంగా అభివర్ణించారు. రాజ్యాంగంపై జరిగిన దాడిని మేము అడ్డుకున్నాం. ఇది కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే కాదు, భారతదేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చే కుట్ర. ఆ ప్రయత్నాన్ని మేము ఓడించాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇది మహిళా రిజర్వేషన్ల గురించి కాదు, ప్రజాస్వామ్యం గురించి. రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో ముడిపెట్టడాన్ని మేము ఎప్పటికీ అంగీకరించం. హత్రాస్, ఉన్నావో, మణిపూర్ ఘటనల్లో స్పందించని వారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని విమర్శించారు ప్రియాంక గాంధీ.

సభకు హాజరై ఓటు వేసిన వారిలో కనీసం రెండొంతుల (2/3) మంది మద్దతు ఇవ్వాలి..ప్రస్తుతం ఎన్డీయేకు అనుకూలంగా ఓట్లు వచ్చినా, ఆ సంఖ్య 2/3 వంతుకు చేరుకోకపోవడంతో బిల్లు చట్టంగా మారలేకపోయింది అన్నారు.అంతకుముందు జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. 2029 నుండి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకుంటున్న వారు, వచ్చే ఎన్నికల్లో మహిళల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.

Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

బిల్లు వీగిపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ఎన్డీయే నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేయగా, సభ వాయిదా పడింది.

- Advertisement -