రోహిత్ శర్మ గాయంపై అప్‌డేట్!

9
- Advertisement -

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఆయనకు హామ్‌స్ట్రింగ్ గాయం (Hamstring injury) అయింది. ఈ నేపథ్యంలో రోహిత్ కోలుకుంటున్న తీరుపై ఎంఐ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే అప్‌డేట్ ఇచ్చారు.

రోహిత్ తదుపరి మ్యాచ్ ఆడతారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ…రోహిత్ నిన్నటి నుండి రన్నింగ్ ప్రారంభించాడు. అతని పరిస్థితిని రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం. తన శరీరం గురించి అతనికే బాగా తెలుసు. గాయం పెద్దది కానప్పటికీ, మేము రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇది సీజన్ ప్రారంభం మాత్రమే కాబట్టి అతన్ని తొందరపెట్టడం లేదు అని కోచ్ జయవర్దనే చెప్పారు.

Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

టాస్ సమయంలో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, రోహిత్ కనీసం ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే, ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ నాటికి రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -