ఉమెన్స్ డే : మోడీకి ఐదు ప్రశ్నలు.. ?

25
- Advertisement -

ఉమెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, గత పదేళ్ల కాలంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని మోడీ పాలనపై కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. తాజాగా జైరాం రమేశ్ మహిళలకు సంబంధించి ఐదు ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కోరారు. మహిళలను మణిపుర్ లో నగ్నంగా ఊరేగించినప్పుడు మోడీ ఎందుకు స్పందించలేదు ? మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో మోడీ ఎందుకు నిశబ్ధంగా ఉన్నారు ? భేటీ బచావో భేటీ పడావో యోజన ఏమైంది ? మహిళా భద్రత లేకపోవడం ? ధరల పెరుగుదల వంటి అంశాలను ఉద్దేశించి ఐదు ప్రశ్నలను మోడీపై సంధించారు జైరాం రమేశ్. .

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడాది మణిపుర్ అంశం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ స్పందించలేదని, మణిపుర్ విషయంలో బీజేపీ సర్కార్ అలసత్వం ప్రదర్శించిందనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. అదే విధంగా మహిళా రెజ్లర్ పై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు కూడా మోడీ ఏ మాత్రం స్పందించలేదు.

ఈ అంశాలపై గత కొన్నాళ్లుగా ప్రధాని మోడీ తీరును తప్పుబడుతూ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు ఈ విమర్శల వేడి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. మరి మహిళా భద్రత విషయంలో బీజేపీ సర్కార్ పై వస్తున్న విమర్శలు ఎంతో కొంత చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. ఈ విమర్శలు ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీసే అవకాశం కూడా ఉంది. మరి ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోడీ లేదా ఇతర బీజేపీ అధినాయకులు ఎవరైనా స్పందిస్తారా ? లేదా ఎప్పటిలాగే నిశబ్ద వైఖరిని పాటిస్తారా ? అనేది చూడాలి.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -