బిగ్ బాస్ హౌస్ లో లైగింక వేధింపులు..మహిళా కమిషన్ కు ఫిర్యాదు

733
kavitha gowda
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. మొదట హిందీలో ప్రారంభమైన ఈషో క్రమేణ అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించింది. కొన్ని విషయాల్లో ఈమాత్రం ఈపో విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా కన్నడ బిగ్‌బాస్ షో పాల్గొని, మధ్యలోనే బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ కవితా గౌడ మరో కంటెస్టెంట్ యాండీపై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో యాండీ తనను లైగికంగా వేధించాడంటూ ఆమె మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

 Kavitha-Gowda

ఇప్పడు కన్నడ సినీ పరిశ్రమలో ఈవివాదం చర్చనీయాంశమైంది. షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమ నిర్మాత గురుదాస్ శణైకి ముందే చెప్పానని, తనకు జరిగిన అన్యాయంపై బయటకు వచ్చిన తరువాతనే నోరు విప్పుతున్నానని తెలిపింది. షోలో భాగంగా రెండు రోజుల పాటు ‘సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌’ టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ లైంగిక వేధింపులకు దిగాడని ఆరోపించింది. నటి కవితా గౌడ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు యాండీ. బిగ్‌ బాస్‌ పోటీల తరువాత ఆమెను తాను కలవలేదని అన్నాడు. ఓటమిని తట్టుకోలేక కవిత తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నాడు.

- Advertisement -