1976నుండి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీఎస్‌ఎఫ్ తరపున ఒంటెల బృందం కవాతు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చే యేడాది అంటే 2023 నుండి తొలిసారి మహిళ బీఎస్‌ఎఫ్ బృందం కూడా ఒంటెలపై స్వారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన వస్త్ర దారణను ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ రూపొందించారు.
రాజస్థాన్ చరిత్రలోని సార్టోరియల్ మరియు సాంస్కృతిక అంశాలను ఇమిడేలా డిజైన్ చేశారు. ఇది పూర్తిగా రాజస్థాన్ వస్త్రదారణ వలే కనిపించనుంది. ఈ డిజైన్‌పై జర్దోసీ వర్క్‌తో చక్కని ఆకృతి గల ఫాబ్రిక్‌ను ఉపయోగించి 400యేళ్ల నాటి చరిత్ర కలిగిన డంకా టెక్నిక్‌ను పూర్తిగా ఉపయోగించినట్టు డిజైనర్ తెలిపారు. బనారస్ నుండి వచ్చిన చేనేతకారులు నేసిన దుస్తులను అందంగా తీర్చిదిద్దారు. తలపాగా కోసం మేవార్ యొక్క సాంప్రాదాయతను ఇమిడి ఉండేలా డిజైన్ చేశారు. రాజస్థాన్ ప్రజల సాంస్కృతిక దుస్తులలో పాగా చాలా ముఖ్యమైనది అందుకు తగ్గట్టుగా మహిళ బృందం ధరించే వస్త్రదారణను రూపొందించారు.
ఇవి కూడా చదవండి…