అంతా కన్నడ ప్రభంజనమే .!

28
- Advertisement -

ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమ అంటే అత్యంత చులకన భావం ఉండేది. ఎందుకంటే రీమేక్ సినిమాలను చేస్తూ ఉండడం ఒక కారణం అయితే.. రొటీన్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. దాంతో కన్నడ సినిమాలంటే చాలా లైట్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కన్నడ పరిశ్రమ నుంచి సినిమా వస్తుందంటే యావత్ దేశమంత ఎదురుచూస్తే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2018 లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన ” కే‌జి‌ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ ఇండియన్ సినీ ప్రియులను కన్నడ పరిశ్రమ వైపు చేసేలా చేసింది.

ఆ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ తో ప్రశాంత్ నీల్, యష్ పేర్లు దేశ వ్యాప్తంగా మారుమ్రోగాయి. దాంతో కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 కోసం నడిచిన వెయిటింగ్ అంతా ఇంతా కాదు. 2022లో రిలీజ్ అయిన కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 మరొక్కసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 1200 కోట్ల వసూళ్లు సాధించి కన్నడ పరిశ్రమ సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. ఇక ఆ తరువాత నుంచి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుసగా కన్నడ సినిమాలు చేసిన దండయాత్రతో బాలీవుడ్ సినిమాలు సైతం కుదేలయ్యాయి.

కే‌జి‌ఎఫ్ చాప్టర్ 2 తరువాత ఎలాంటి అంచనాలు లేకుండా సింపుల్ స్టోరీ లైన్ తో వచ్చిన ” చార్లీ 777 ” మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి హీరో కామ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఆ తరువాత కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన ‘ విక్రాంత్ రోనా ‘ మూవీ కూడా ఇటు సౌత్ లోనూ.. అటు నార్త్ లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇదే ఏడాది వచ్చిన కాంతార మూవీ మరొక్కసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రిషబ్ శెట్టి హిరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం 40 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఇండియా వైడ్ గా 500 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ విధంగా 2022లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమాలు సృష్టించిన బీభత్సం మామూలుగా లేదుమరి.

ఇవి కూడా చదవండి…

హిందీలోకి రవితేజ బ్లాక్ బస్టర్?

పూనకాల వీరయ్య విడుదల

మాస్ హీరోగా కుర్ర హీరో

- Advertisement -