రోటీ మాడిందని తలాక్ చెప్పేశాడు..

292
Woman given triple talaq over burnt roti in banda
- Advertisement -

తలాక్ నిషేధానికి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించినా… ఇంకా తలాక్ చెప్పి ఎంతో మంది భర్తలు, భార్యలను వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిద్రలేవలేదని ఒకరు, వంట రుచిగా లేదని మరొకరు, ఇలాంటి చిన్న చిన్న కారణాలను వంక పెట్టుకుని ఎంతో మంది భర్తలు, వారి భార్యలకు తలాక్ చెప్పి వదిలించుకుంటున్నారు.

triple talaq

తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోని మహూబా జిల్లాలోని పహ్రెతా గ్రామంలో చోటు చేసుకుంది. రోటీ మాడిపోయిందని భార్యకు తలాక్ చెప్పేశాడు ఓ భర్త. మాడిపోయిన రోటీ వడ్డిస్తావా అంటూ ఆగ్రహంతో మూడు సార్లు తలాక్ చెప్పి. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ ప్రభుద్దుడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భాదితురాలు. తన భర్త గత కొద్ది రోజులుగా సిగరేట్లతో కాలుస్తూ.. హింసిస్తున్నాడని, తనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గృహ హింస కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిద్దరికి ఏడాది క్రితమే వివాహం జరిగింది.

తలాఖ్ తిప్పలు మాకొద్దు..

మతాన్ని తలాక్‌తో ముడిపెట్టవద్దు

- Advertisement -