ఢిల్లీలో పెరిగిన కాలుష్యం స్థాయిలు

182
- Advertisement -

మనిషి యంత్రం కనుగొన్నప్పటి నుంచి యంత్రంలా పనిచేస్తూ పోతున్నాడు. ప్రకృతి ఇచ్చిన నీటి భూమిని గాలిని ఆకాశం లాంటి వాటిన్నటిని కలుషితం చేస్తున్నారు. మానవ అవసరాలకు మించి ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల కలుషితం ఎక్కువవుతుంది. అధిక దిగుబడుల కోసం పంటలను రసాయన పదార్ధాలు విచ్ఛలవిడిగా వాడటం వల్ల భూమి కాలుష్యం జరుగుతుంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడంవల్ల భూమిలోకి నీరు ఇంకక భూగర్భ జల మట్టం స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

విచ్ఛలవిడిగా వాహనాలను ఉపయోగించడం వల్ల వాతావరణంలో గాలికాలుష్యం, ఉష్ణం పెరిగి ప్రాణులు మరణిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం దారుణంగా పడిపోయింది. శీతాకాలం వస్తే చాలు ఢిల్లీ ప్రజలు నరకయాతన అనుభవిస్తారు. ఢిల్లీ దాని పరిసరా ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం ఉదయం వాయు గాలుష్యం మరింత తీవ్రమైంది. వాయు నాణ్యత సూచీ 408గా నమోదైంది. ఈ సూచీలో 401 నుంచి 500 మధ్య ఉంటే దానిని తీవ్రస్థాయిగా పరిగణిస్తారు.

రాజధానిలో వాహనాల నుంచి వచ్చే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఆకాశంలో గాఢమైన పొగమంచు ఏర్పడింది. దీంతో కళ్ల మంటలు, గొంతు నొప్పితో పాటు ఊపిరి ఆడక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషపూరితమైన గాలిని పీల్చితే.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పాఠశాలలకు వెళ్లే పిల్లలపై ఈ విష పూరిత గాలి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో తమ పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని రాజధాని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాలి నాణ్యత క్షీణిస్తున్న దృష్ట్యా ఢిల్లీ, దాని పరిసరాల ప్రాంతాల్లోని కొన్ని ప్రవేట్ స్కూల్స్ లను మూసివేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. నగరంలో గాలి నాణ్యత మెరుగుపడేంత వరకు పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది.

మరోవైపు.. పాఠశాలలను మూసివేయడానికి బదులుగా నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించడానికి అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదనీ, కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైనా చేయాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో మంగళవారం 424కు పడిపోయిన గాలి నాణ్యతా సూచీ.. నిన్న మెరుగై 376కు చేరింది. తాజాగా మళ్లీ 408గా నమోదైంది. 401 నుండి 500 మధ్య లో గాలి నాణ్యతా సూచీ ఉంటే.. తీవ్ర గాలి కాలుష్యంగా పరిగణిస్తారు. నవంబర్ నుంచి ఢిల్లీలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.

గాలి నాణ్యతా సూచీ..

  • సున్నా నుంచి 50 మధ్య నమోదైతే.. మంచిది
  • 51 నుంచి 100 మధ్య ఉంటే.. సంతృప్తికరం
  • 101 నుంచి 200 మధ్య నమోదైతే.. మధ్యస్థం
  • 201 నుంచి 300 మధ్య గాలి నాణ్యతా సూచీ ఉంటే పేద
  • 301 నుంచి 400 మధ్య నమోదైతే.. చాలా పేలవమైనదిగా
  • 401 నుండి 500 మధ్య లో గాలి నాణ్యతా సూచీ ఉంటే తీవ్రమైన గాలి కాలుష్యంగా పరిగణిస్తారు.

ప్రమాదకరమైన పొగ మరియు వాహనాలు మరియు కర్మాగారాల నుండి వచ్చే వాయువులు వాతావరణంలోని తేమతో కలిస్తే పొగ మంచు ( స్మోక్) ఏర్పడుతుంది. పొగమంచు అనేది వాస్తవానికి ఒక రకమైన వాయు కాలుష్యం. ఇది దృశ్యమానతను కూడా తగ్గిస్తుంది. పొగమంచులో అనేక రకాల విష వాయువులు, రసాయనాలు కలిగి ఉంటాయి. ఇందులో ప్రధానంగా నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు, ఓజోన్ వాయువు, పొగ, ఇతర కణాలతో ఏర్పాడుతుంది. ఇందులో వాహనాల నుంచి వెలువడే పొగ కూడా మిళితమయ్యి ఉంటుంది. ఢిల్లీ వాయు కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే పొగ 50 శాతంగా ఉంది.

దీంతో ఢిల్లీ ప్రభుత్వం వాయుకాలుష్యం నియంత్రించడానికి పలు చర్యలు చేపట్టింది. ఢిల్లీలో అన్ని నిర్మాణ కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమల్లోకి తీసుకువచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ. 5వేలు అందించాలిన సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయాలని, ప్రైవేట్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్‌ ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

చలికాలంలో వేడినీళ్లు.. చన్నీళ్లు.. ఏది బెటర్

మానవ శరీరం…అదిరిపోయే నిజాలు

వెండితెర వెనుక ఎన్నో వ్యథలు

- Advertisement -