CM KCR:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే

38
- Advertisement -

గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువ స్ధానాలు వస్తాయని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని…బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. శాసనసభలో రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.

తెలంగాణ తలసరి ఆదాయం ఘణనీయంగా పెరిగిందని…తలసరి ఆదాయం ఎంత పెరిగితే అంత ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగణిస్తారన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది. ఏర్పాటు తర్వాత పెద్ద రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యంలో ఆ రోజు తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనాడు ఉన్న కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వ్యతిరేకించినా ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు.

Also Read:రాహుల్ గాంధీ..ఈసారి కూడా కష్టమే?

విడిగొట్టిన సందర్భంలో ఇచ్చిన హామీలు కాలరాస్తే ప్రేక్షకపాత్ర వహించిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. 1969లో చెన్నారెడ్డి, విద్యార్థులు, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే.. చివరకు తెలంగాణ డెమొక్రటిక్‌గా 14 ఎంపీ స్థానాల్లో 11 మందిని గెలిపించి.. యావత్‌ తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి అంటే.. ఆ నాడు ఇందిరాగాంధీ నో తెలంగాణ అని నిరాకరించరన్నారు. ఆ తర్వాత ముల్కి రూల్స్‌ కొల్లగొట్టబడి.. ఉద్యోగాలు మొత్తం మాయమై.. నీళ్లు మొత్తం పోతావుంటే.. తట్టుపుట్టడు మన్ను తీసి ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెడితే ఉంటే కూడా మూగ, మౌన ప్రేక్షకపాత్ర వహించింది కూడా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలే అని మండిపడ్డారు.

Also Read:కే‌సి‌ఆర్ బరిలో దిగేది..అక్కడినుంచే?

- Advertisement -