కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తాః పంజాబ్ సీఎం

379
Amarindar Singh
- Advertisement -

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి మేము అనుకున్నన్ని సీట్లు రాకుంటే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనుకున్నన్ని స్ధానాల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఆ బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకు బాధ్యత తీసుకోవాలన్నారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్ధానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. 2014ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి 13సీట్లకు గాను 3 స్ధానాల్లో విజయం సాధించగా..బీజేపీ 6, ఆప్ 4 స్ధానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్ధానాలకు గాను 77 సీట్లు గెలచి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. తుది విడతలో భాగంగా మే 19న పంజాబ్ లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -