ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న సోని చరిష్టా..!

177
soni charista

తెలుగు ప్రేక్షకులకు, పరిశ్రమ వర్గాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు సోనీ చరిష్టా. ఏ అగ్ర హీరోయిన్ కూ తీసిపోని అందం, అభినయం, నాట్యం కలిగిన ఈ ముంబై ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ.. జాతీయ నటిగా పేరు గడించాలానే సంకల్పంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. తెలుగు-కన్నడ-తమిళ భాషల్లో ఏక కాలంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి(కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి), సోనీ చరిష్టా, కళాతపస్వి కె.విశ్వనాధ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వంలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫరీన్ ఫాతిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ టైటిల్ ‘ఇద్దరు’.

హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గోవా, థాయిలాండ్ లలో షూటింగ్ జరుపుకున్న ‘ఇద్దరు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు థ్రిల్లింగ్ అంశాలతో సాగే హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘ఇద్దరు’ చిత్రం తనకు మరింత పేరు తెస్తుందని ఆశిస్తున్నానని సోనీ చెబుతోంది. ఈ చిత్రం కాకుండా హిందీ, కన్నడ భాషల్లో నూ నటిస్తున్నానని, తెలుగులో త్వరలోనే ఒక మంచి సినిమాకు సైన్ చేయనున్నానని సోనీ తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధిక కుమారస్వామి, గ్రేట్ డైరెక్టర్ కె.విశ్వనాధ్ వంటి హేమాహేమీలతో నటించడం చాలా గర్వంగా ఉందని, చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. సమీర్, నిర్మాత ఫరీన్ ఫాతిమాలకు తాను ఎప్పటికి రుణపడి ఉంటానని సోనీ పేర్కొంది.