బీఆర్ఎస్‌కు పవన్ సపోర్ట్!

125
- Advertisement -

భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ స్ధాపనే లక్ష్యంగా ముందుకు సాగుతుండగా ముందుగా ఏపీపై దృష్టిసారించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే కాన్సెప్ట్‌తో ఫస్ట్ ఫోకస్‌ ఏపీపై సారించారు.

జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు గల అవకాశాలపై పలువురు ప్రముఖులు, మేధావులతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా మాజీ ఎంపీ ఉండవల్లి పేరు ప్రచారంలో ఉంది. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తూ వస్తున్న కేసీఆర్‌…బీఆర్ఎస్‌కి మద్దతుగా పలువురిని ప్రచారం చేయిస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఇందులో భాగంగా ఏపీలో జనసేనతో పొత్తు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీకి జనసేనకు మధ్య గ్యాప్ రావడంతో దీనిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ కు అనుబంధంగా పవన్ కళ్యాణ్ ను కలుపుకుపోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -