గరికపాటిపై ఆర్జీవీ ఫైర్

81
rgv
- Advertisement -

ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఆర్జీవీ…ఐ యాం సారీ నాగబాబు గారు మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం అని తెలిపారు.

త్తగ్గేదెలె. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో. హే గూగురుపాటి నరసింహ రావు, తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి అంటూ పంచులేశాడు.

- Advertisement -