విజయ్ ఆశలన్నీ ఖుషిపైనే!

101
vijay
- Advertisement -

లైగర్‌తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా మూవీగా భారీ స్ధాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడగా ఈ సినిమాతో విజయ్ కెరీర్‌ డైలమాలో పడింది.

ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ ప్రాజెక్టు ఖుషిపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు విజయ్. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే విజయ్ మార్కెట్ అమాంతం పడిపోయే అవకాశాలుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇక ఇటీవలె రష్మిక మందన్నతో విజయ్ ఫోటోలు వైరల్‌గా మారగా వీరిద్దరి రిలేషన్‌ షిప్‌పై గాసిప్స్‌ రాగా మరోసారి స్పందించింది రష్మిక. విజయ్ తనకు ఫ్రెండ్ మాత్రమే…కెరీర్ ప్రారంభంలో ఇద్దరం కలిసి సినిమాలు చేశాం అంతే తప్ప ఆ వార్తల్లో నిజం లేదన్నారు.

- Advertisement -