మీరు టీవీ చూస్తూ తింటున్నారా..? ఐతే సమస్యల్లో ఉన్నట్టే..!

195
- Advertisement -

మీకు టీవీ చూసే అలవాటుందా..? మీరు మంచి భోజన ప్రియులు కూడానా..? అప్పుడప్పుడు మీరు టీవీ చూస్తూ ఆహారం తింటుంటారా? అయితే మీరు సమస్యల్లో చిక్కుకున్నట్టే. అవును మీకు తెలియకుండానే మీరు లావెక్కిపోతారు. టీవీ చూస్తూ భోజనం చేస్తే లావవుతారంట.

 Why eating in front of the TV makes you fat

అయితే..కలిసి భోజనం చేస్తే మనసు వికసిస్తుంది. అంతేకాదు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందంటున్నారు పరిశోధకులు. కానీ టీవీ చూస్తూ ఆహారం తింటే స్థూలకాయం వస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓహియో యూనివర్సిటీలో 13వేలమందికిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది.

కుటుంబంతో కలిసి భోజనం చేస్తే.. స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువ అని తాజా పరిశోధనలో తెలిసింది. ఇళ్లలో భోజనం చేసే సమయంలో టీవీ చూస్తే.. తనకు తెలియకుండానే అధిక ఆహార, పానియాలను సేవిస్తాడని తెలిపారు పరిశోధకుల బృందం నాయకుడు రాచెల్‌ టుమిన్‌. దీని వల్ల కొవ్వు పెరిగి.. ఉబ్బసం, ఆయాసం లాంటి శ్వాసకోస వ్యాధులతో బాధపడాల్సి వస్తుందంటున్నారు సైంటిస్టులు.

- Advertisement -