బన్ని అక్కడికి ఎందుకెళ్ళట్లేదు..?

160
Allu Arjun's 'DJ' Shooting Stopped Why

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ లేటెస్ట్‌ మూవీ డీజే (దువ్వాడ జగన్నాథం). ఈ సినిమా షూటింగ్‌లొ యమజోష్‌గా పాల్గొనే బన్ని ఇప్పుడు షూటింగ్‌ కి వెళ్ళడంలేదట. దీంతో బన్ని ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. అస‌లు బ‌న్నికి ఏమైంది? ఆయ‌నెందుకు షూటింగుకి రాలేదు? అంటూ ఫిలింన‌గ‌ర్‌లో కూడా . ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని ‘డీజే- దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్’ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే.

 Allu Arjun's 'DJ' Shooting Stopped Why

అయితే ఇటీవ‌ల ఈ సినిమా షూటింగుకి బ‌న్ని స్వ‌ల్ప విరామం ఇచ్చార‌ని తెలిసింది. కార‌ణ‌మేంటి? అంటే బ‌న్ని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడట‌. అయితే కార‌ణం ఏదైనా షూటింగ్ బ్రేక్ అయ్యింది. అలాగే రిలీజ్ విష‌యంలోనూ కాస్త కన్ఫూజన్‌ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఎలానూ ఏప్రిల్ 28న బాహుబ‌లి-2 అత్యంత క్రేజీగా రిలీజ‌వుతోంది. అటుపై జూన్‌లో మ‌హేష్ – మురుగ‌దాస్ భారీ చిత్రం రిలీజ్‌కి వ‌స్తోంది. ఈ రెండు సినిమాలు భారీ క్రేజుతో వ‌స్తున్నాయి, కాబ‌ట్టి ఇక బ‌న్ని జూలైలో వ‌చ్చేందుకే ఫిక్స్‌ అయ్యాడని అంటున్నారు.