విజయ్ దేవరకొండ… గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. తన నటన, ప్రవర్తనతో యూత్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అతడి సినిమా కోసం అభిమానులు ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం అతడు నటించిన ‘నోటా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ ని బట్టి సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
అయితే విజయ్ దేవరకొండ మూవీ కెరియర్లోనే ఓ మైలురాయిగా నిలిచే చిత్రం అర్జున్ రెడ్డి తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడదలైన ఈ మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులు నెలకొల్పింది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సందిప్ వంగ తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ మూవీని మళయాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ అనే టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో తమిళంలోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అటు హిందీలోనూ ఈ సినిమాను రిమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది. తెలుగు అర్జున్ రెడ్డి తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా హిందీ రీమేక్‌ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. తెలుగులో పలు రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ మాలీవుడ్, బాలీవుడ్లో ఎటువంటి సంచనాలు నెలకొల్పుతుందో చూడాలి.