గోల్డెన్ టెంపుల్‌లో నయన్-విఘ్నేశ్‌..

189
nayan

దక్షిణాదిలో లేడి సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరోవైపు లవర్‌ విఘ్నేశ్‌తో పర్సనల్‌ లైఫ్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అమృత్‌ సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ని దర్శించారు ఈ ప్రేమపక్షులు.

ప్రియుడితో కలిసి సిక్కు మత సంప్రదాయ వస్త్రధారణతో కనిపించిన నయన్…గోల్డెన్‌ టెంపుల్‌లో ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారాయి.

nayanthara

తమిళ్‌లో నీల్సన్ దర్శకత్వంలో వచ్చిన ‘కొలమావు కోకిల’, అజయ్ ముత్తు డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇమక్కా నడిగల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది నయన్‌. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా చిత్రంతో పాటు తమిళ్‌లో అజిత్ సరసన ‘విశ్వాస్’ చిత్రంలో నటిస్తోంది. బిజీ షెడ్యూల్డ్ నుండి కాస్త రిలీఫ్ దొరకడంతో ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పుణ్యక్షేత్రాలను చుట్టేస్తోంది నయన్‌,. .