మాజీ ప్రియుడిపై కరీనా ఫైర్

31
- Advertisement -

దాదాపు 20 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ లో షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ మధ్య చాలా ఘాడమైన ప్రేమ వ్యవహారం నడిచింది. అప్పట్లో క్యూట్‌ లవ్‌ బర్డ్స్‌ గా వీరిద్దరికి ఫుల్ క్రేజ్ ఉండేది. దీనికితోడు ఓ కారులో మిడ్ నైట్ పూట కరీనాతో షాహిద్‌ రోడ్ మీదే సరసాలు ఆడిన విజువల్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ముఖ్యంగా 2004లో కరీనా – షాహిద్‌ ముద్దు వీడియో ఒకటి బయటపడింది. ఐతే దీనిపై 19 ఏళ్ల తర్వాత షాహిద్‌ స్పందిస్తూ నేను చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు.

ఎప్పుడో గడిచిపోయిన బాగోతం గురించి ఇప్పుడు ఎందుకు బయటకు చెప్పడం అంటూ కరీనా కపూర్‌ బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. అప్పట్లో కూడా తన తప్పేం లేకుండానే షాహిద్‌ నుంచి తప్పుకునేలా చేశారు. దానికి ఎవరు కారణం అనే విషయంలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఐతే, షాహిద్‌ కపూర్ తల్లి ఒత్తిడి వల్లే కరీనాను తన జీవితం నుంచి షాహిద్ తప్పించాల్సి వచ్చింది అనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. సరే కాలం చాలా ముందుకు వచ్చేసింది.

Also Read:యాక్షన్ మోడ్‌లో రామ్ చరణ్‌!

అటు షాహిద్ కి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఇటు కరీనాకి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అప్పుడు జరిగిన విషయాలను చెప్పడం ఎందుకు ? అనేది కరీనా పాయింట్. ఇదే విషయంపై ఆమె షాహిద్ కి ఫోన్ చేసి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. నీకు సిగ్గు లేదు అంటూ ఫైర్ అయినట్టు కూడా టాక్. ఇంతకీ షాహిద్ ఏం మాట్లాడాడు అంటే.. కరీనాతో నా వీడియోని ఓ వ్యక్తి కేవలం రూ.500 కోసం లీక్ చేశాడు. అప్పుడు నాకు 24 ఏళ్లు. అందుకే, నా ఫోటోలు, వీడియో లీక్‌ అవడంతో చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు.

Also Read:ఆస్తమా ఉందా..అయితే జాగ్రత్త!

- Advertisement -