షాకింగ్‌..కోవాగ్జిన్ వేసుకుంటే ఆ దేశాల్లో నో ఎంట్రీ!

253
covaxin
- Advertisement -

నిజంగా ఇది షాకింగ్ న్యూసే…భారత్‌లో కరోనా కట్టడికి మొదటి నుండి రెండు వాక్సిన్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా ఒకటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ కాగా మరోకటి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.

అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర యూజ్ లిస్టింగ్‌లో కోవాగ్జిన్‌కు చోటు దక్కలేదు. దీంతో డబ్ల్యూహెచ్‌వో అనుమతించిన టీకాలు వేసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించాయి అమెరికా, యుకే.

దీంతో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ ను తీసుకోవడానికి చాలా మంది సందేహిస్తున్నారు. అయితే భారత్ బయోటెక్ మాత్రం తమ టీకా.. అమెరికా, యూకే లోని వైరస్ ను సమర్థవంతంగా ఎదురుకుంటుందని వెల్లడించినా…డబ్ల్యూహెచ్‌వో అత్యవసర యూజ్ లిస్టింగ్ లో చోటు దక్కక పోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

- Advertisement -