కర్ణాటకలో కరోనా కల్లోలం..

42
kar

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా రోజురోజుకు తగ్గుముఖం పడుతుండగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

గత 24 గంటల్లో 25,979 కొత్త కేసులు నమోదుకాగా ఏకంగా 626 మంది మృతి చెందారు. ఇక కర్ణాటలో మొత్తం కేసుల సంఖ్య 24,23,904కి చేరగా 4.72 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు కరోనాతో 25,282 మంది మృతిచెందగా పాజిటిటీ రేటు 20.76 శాతం, మరణాల రేటు 2.40శాతంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.