Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !

25
- Advertisement -

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పొత్తుల విషయంలోనూ, ఎన్నికల వ్యూహాలలోనూ ఓ క్లారిటికి వచ్చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీని వాడుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో తప్పక కలవాల్సిన పరిస్థితి. మరోవైపూ టీడీపీతో కలిసినడిచేందుకు బీజేపీ ససేమిరా అంటోంది. దాంతో ఎలాగైనా టీడీపీ, బీజేపీని కలిపి కూటమిగా నడిచేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ ప్రయత్నలేవీ కూడా బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు.

టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని,.. తమతో పొత్తులో ఉండాలా లేదా అనేది పవన్ ఇష్టమని, తాము మాత్రం టీడీపీతో కలవమని రాష్ట్ర బీజేపీ నేతలు గంటాపథంగా చెబుతున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా జరిగిన తూర్పు గోదావరి పర్యటనలో పవన్ పొత్తుల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. తాము టీడీపీతో కలిసి నడుస్తామని.. అవసరమైతే బీజేపీని కూడా ఒప్పిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖాయమైనట్టే. ఇప్పుడు అసలు చిక్కంతా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. ఒకవేళ బీజేపీ టీడీపీ కలవకపోతే పవన్ బీజేపీకి టాటా చెప్పి పూర్తి స్థాయిలో టీడీపీ దోస్తీకి సై అనే అవకాశం ఉంది.

Also Read:మళ్లీ ప్రేమలో పడిన త్రిష

అసలే కర్నాటక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ.. ఏపీలో జనసేనను దూరం చేసుకుంటే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే అంశం కమలనాథులను డైలమాలో పడేసిందట. దాంతో ఇన్నాళ్ళు టీడీపీతో దోస్తీకి ససేమిరా అంటూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలు.. పవన్ ప్రతిపాధించిన మూడు పార్టీల కూటమిని డిల్లీ పెద్దలకు తెలియజేస్తామని, కూటమి విషయంలో తుది నిర్ణయం బీజేపీ పెద్దలదే అని చెబుతున్నారు. మరి పవన్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు ఒకే అంటారా ? లేదా ఎప్పటిలాగే టీడీపీతో నో దోస్తీ అంటారా అనేది చూడాలి.

- Advertisement -