Akhil:అఖిల్ కు హిట్ ఇచ్చేదెవరు?

21
- Advertisement -

స్టార్ హీరో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి అక్కినేని వారసుడు అఖిల్ కు లక్ కలిసి రావడం లేదు. 2015 లో రిలీజ్ అయిన “అఖిల్” మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని చిన్నోడికి.. పదేళ్ళు అవుతున్న ఒక్క సరైన హిట్ లేదు. చేసిన ప్రతి సినిమా ఆడియన్స్ తో పాటు అక్కినేని అభిమానులను సైతం నిరాశ పరుస్తున్నాయి. అఖిల్, హలో మూవీస్ ఫ్లాప్ కాగా మోస్ట్ ఎలిజేబుల్ బ్యాచిలర్ కాస్త పరవలేదనిపించింది. ఇక గత ఏడాది వచ్చిన ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ కారణంగా అఖిల్ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఏజెంట్ మూవీ రిలీజ్ అయి ఏడాదిన్నర కావొస్తున్న అఖిల్ కొత్త మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. గత కొన్నాళ్లుగా అఖిల్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యువీ క్రియెషన్స్ బ్యానర్ లో ఓ మూవీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. .

భారీ బడ్జెట్ తో ఈ మూవీనీ రూపొందిస్తున్నట్లు వినికిడి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ కూడా జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని డైరెక్టర్ అనిల్ కుమార్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ కసిగా ఉన్నాడు. ఇకపోతే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ” కల్కి 2898 ఏ.డి ” మూవీలో కూడా అఖిల్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. దీంతో అసలు అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అనేది మిస్టరీగానే ఉంది. మరి ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉన్న అఖిల్ కు.. అదిరిపోయే హిట్ ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలి.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -