మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో డిప్యూటీ సీఎం అజిత్ పావార్ – ఐపీఎస్ అధికారి అంజలి కృష్ణ మధ్య జరిగిన మాటల సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకు జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి కర్మాలా డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అంజలి కృష్ణ అక్కడ తన బృందంతో కలిసి చర్యలు చేపట్టారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అంజలి కృష్ణ అక్రమ తవ్వకాలను ఆపే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రతిఘటించడమే కాకుండా పోలీసులను బెదిరించారనేది సమాచారం. దీంతో స్థానిక ఎన్సీపీ నేతలు.. అజిత్ పావార్‌కు ఫోన్ చేయగా ఆయన అంజలి కృష్ణతో ఆపరేషన్ వెంటనే నిలిపివేయమని, స్థానిక తహసీల్దార్‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
అయితే మాట్లాడుతుంది..అజిత్ పవారేనని తాను ఎలా నమ్మాలని వీడియో కాల్ చేయాలని చెప్పగా మరింత ఆగ్రహించిన పవార్..నీపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి కూడా ఆపరేషన్ ఆపాలని గట్టిగా ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ప్రతిపక్షం… పావార్‌పై తన పదవిని దుర్వినియోగం చేసి అక్రమ కార్యకలాపాలకు అండగా నిలిచారంటూ విమర్శలు గుప్పిస్తుండగా, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ అంజలి కృష్ణ ధైర్యంగా నిలిచిందని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
Also Read:నాడు పీసీసీ చీఫ్‌గా..నేడు సీఎంగా
ఈ నేపథ్యంలో నెటిజన్లె ఎవరి అంజలి కృష్ణ అని సెర్చ్ చేస్తున్నారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అంజలి కృష్ణ ప్రస్తుతం సోలాపూర్ జిల్లాలో పనిచేస్తున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం వాసి అయిన ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి చిన్న వస్త్ర దుకాణం నడుపుతుండగా, తల్లి స్థానిక కోర్టులో టైపిస్టుగా పని చేస్తున్నారు. 2022లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 355వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికైన అంజలి కృష్ణ… తన నిజాయితీ, ధైర్యం, పరిపాలన నైపుణ్యాలతో గుర్తింపు పొందారు.

