- Advertisement -
నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నాను…మళ్లీ ముఖ్యమంత్రిగా గణపతిని దర్శించుకునే భాగ్యం కలిగింది అన్నారు రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన సీఎం.. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు అన్నారు.
దేశంలో ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది…. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు చెపపారు.
ఈసారి నగరంలో దాదాపు లక్షా నలభై వేల విగ్రహాలు ప్రతిష్టించారు…. గణేష్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించాము అన్నారు.
Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం
- Advertisement -

