whatsapp:వాట్సాప్ స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో

42
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరో అదిరే ఫీచర్‌ని తీసుకొచ్చింది.

తాజాగా వాట్సాప్ స్టేటస్‌లో ఉండే షేరింగ్ ఆప్షన్‌ను మరింత సులభతరం చేస్తోంది. మెటా యాజమాన్య పరిధిలో ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్‌లతో స్టేటస్‌‌లను షేర్ చేసుకునేందుకు హెల్ప్ చేయనుంది. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే పోస్టులు, రీల్స్‌లను డైరెక్టుగా ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే మాదిరిగా ఇప్పుడు తమ వాట్సాప్ స్టోరీని లింక్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునేందుకు యూజర్లకు పర్మిషన్ ఇవ్వనుంది.

Also Read:ఉంగరాల జుట్టు… సంరక్షణ చిట్కాలు

ఇప్పటిదాకా యూజర్లు ఆటో షేర్ ఆన్ ఫేస్‌బుక్ ఎంపికను ఆన్ చేస్తే వాట్సాప్ స్టేటస్‌ను డైరెక్టుగా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే యాప్ సెట్టింగ్సును మారుస్తారో వారు ఎప్పుడైనా ఈ ఆప్షన్‌ను స్టార్ట్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. మీరు ఏదైనా స్టోరీని షేర్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ స్టోరీకి షేర్ స్టేటస్ ఎనేబుల్ చేసుకునేందుకు ఒక సెటప్ ఆప్షన్ కనిపించనుంది. అప్పుడు మీకు కావాల్సిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కనిపించే ఆప్షన్లలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ స్టేటస్‌లు డైరెక్టుగా ఫేస్‌బుక్‌లోనూ షేర్ అయిపోతాయి. ఈ ఆప్షన్‌ను మీరు ఎప్పుడైనా ఆఫ్ చేయొచ్చు.. ఆన్ చేసుకోవచ్చు.

Also Read:31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం..

- Advertisement -