కంప్యూటర్ లో ‘వాట్సాప్ లాక్’ వేయండిలా!

18
- Advertisement -

నేటి రోజుల్లో వాట్సప్ వాడకం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇతరులకు మెసేజ్ లు, ఫోటోలు, వీడియో క్లిప్స్.. షేర్ చేయడానికి అందరూ వాట్సాప్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంకా ఈ వాట్సప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేసుకోవడం, ఆఫీస్ వర్క్ షేర్ చేసుకోవడం ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే వాట్సప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మెసేజింగ్ అప్లికేషన్. అయితే ఈ వాట్సప్ ను మొబైల్ తో పాటు కంప్యూటర్ లో కూడా ఉపయోగిస్తుంటారు. .

కంప్యూటర్ లో సపోర్ట్ చేసే విధంగా వాట్సప్ సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ చాలా మంది వాట్సప్ వెబ్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే మొబైల్ లో మాదిరి వాట్సప్ చాట్ కు లాక్ వేసుకునే విధంగా వాట్సప్ వెబ్ కు లాక్ వేయడానికి కుదిరేది కాదు. అందువల్ల వాట్సప్ వెబ్ లోని చాట్ ను ఇతరులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాట్సప్ వెబ్ కు కూడా లాక్ వేసుకునే కొత్త ఫీచర్ ను మెటా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదెలాగో తెలుసుకుందాం.!

వాట్సప్ వెబ్ కి లాక్ వేసుకునే విధానం
ముందుగా మీ కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఎడమవైపు పైభాగంలో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత కాస్త కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయాలి. ఆ తరువాత ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రైవసీలో కాస్త కిందకు స్కోల్ చేస్తే కొత్తగా స్క్రీన్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. అక్కడ స్క్రీన్ లాక్ పైన క్లిక్ చేయగానే పాస్వర్డ్ సెట్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాట్సప్ వెబ్ లోని చాట్ ఇతరులు చూడకుండా సేఫ్ గా ఉంటుంది.

Also Read:షుగర్ పేషెంట్లు పాలు తగవచ్చా ?

- Advertisement -