మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఈ స్థూలశరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూలశరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కనుక ఇవి రెండూ ఒకదానినొకటి ప్రభావితం చెయ్యగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యమూ, ఒత్తిడీ, శరీరాన్నీ ప్రభావితం చేస్తాయి.
మన ఆలోచనల సమూహమే – మనస్సు… మనం తినే ఆహారం నుంచి మనసు తయారవుతుంది. మనం తినే ఆహారంలో 1/6 వ వంతు మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి మనం తినేది & ఎలా తినాలో ముఖ్యం.మనం సందర్శించే స్థలాల ఆధారంగా కూడా మనస్సు తయారవుతుంది.మనస్సు తన ఇష్టానుసారం చేయడానికి మనం చాలా స్వేచ్ఛ ఇచ్చాము.మన లక్షల, కోట్ల జన్మల ఫలితం..మన మునుపటి జన్మల వాసనలు మనస్సును శాసిస్తున్నాయి.
Also Read:9 మందితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా