జాన్వీ కపూర్ చాలా అరుదు

21
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు శ్రీదేవి. మరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ కూడా ఆమె వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తోంది. ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తోంది. రోజురోజుకు జాన్వీ కపూర్ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ షోతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. బేసిక్గా జాన్వీ కపూర్ కు పలు బ్యూటీఫుల్ లొకేషన్స్ లో ప్రయాణం చేయడం చాలా ఇంట్రెస్ట్.

అయితే, జాన్వీ కపూర్ రీసెంట్ గా కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్‌ను విజిట్ చేసింది. అక్కడ జాన్వీ కపూర్ షిప్ రైడ్‌ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తాను నీలిరంగు ట్రాపికల్-ప్రింటెడ్ స్కర్ట్‌తో.. తెల్లటి స్లీవ్‌ లెస్ క్రాప్ టాప్‌ లో జాన్వీ కపూర్ చాలా స్టైలిష్ గా కనిపించింది. మొత్తానికి, జాన్వీ కపూర్ చాలా అరుదు అంటూ తన ఫొటోస్ కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ మధ్య జాన్వీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా జాన్వీ కపూర్ హాట్ లుక్స్ పై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అదేవిధంగా రామ్ చరణ్ – బుచ్చిబాబు కలయికలో రాబోతున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి జాన్వీ కపూర్ కి సౌత్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది.

Also Read:9 మందితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

- Advertisement -