లేట్ ప్రెగ్నెన్సీ లాభామా ? నష్టమా ?

16
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది మహిళలకు లేట్ ప్రెగ్నెన్సీ అవుతుంటుంది. కొందరికి పెళ్ళైన ఏడాది లోపే పిల్లలు పుట్టేస్తుంటారు. మరికొందరికి పెళ్లై ఐదారు సంవత్సరాలు దాటిన పిల్లలు పుట్టక బాధపడుతుంటారు. ఇంకొందరైతే కావాలనే పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏవైనా గాని ప్రస్తుత రోజుల్లో చాలమంది 35 ఏళ్ల తరువాతనే పిల్లలు కంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా లేట్ ప్రెగ్నెన్సీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం !

లాభాలు
చాలమంది మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఎందుకంటే శరీర పరంగా వచ్చే మార్పులు, తరచూ అనారోగ్యానికి గురౌతుండడం వంటి కారణాల వల్ల మహిళలు మనోదైర్యాన్ని కోల్పోతుంటారు. తద్వారా మానసిక రుగ్మతలు వెంటాడుతాయి. అయితే 35 దాటిన మహిళాలు గర్భం దాల్చినప్పుడు వారి ఆలోచన పరంగా ఎంతో పరిణితి ఉంటుంది. తద్వారా ఆ టైంలో వచ్చే ఆరోగ్య మార్పుల విషయంలో సహనంగా ఉంటూ దైర్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఆర్థికపరంగా కూడా అప్పటికే స్థిరపడి ఉండడం వల్ల లేట్ ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు ఎలాంటి ఆందోళన చెందరని పరిశోదనలు చెబుతున్నాయి.

నష్టాలు
లేట్ ప్రెగ్నెన్సీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మహిళలు 35 ఏళ్ళు దాటాక గర్భం దాల్చితే వారిలో డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా వయసు పైబడిన వారిలో సమాజమైన ప్రసవం కలగడం తక్కువ. సిజేరియన్ బారిన పడే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా పుట్టబోయే పిల్లల్లో కూడా అంగవైకల్యం రావడం, బరువు తక్కువగా ఉండడం, అనారోగ్య బారిన పడడం.. వంటి సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:ఆరోగ్యాన్నిపెంచే.. ఆహారపు అలవాట్లు!

- Advertisement -