టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఏపీతో పాటు తెలంగాణలో కూడా సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. తెలంగాణలో కూడా టీడీపీకి కొన్ని నియోజిక వర్గాలపై మంచి పట్టు ఉంది. దాంతో ఉన్న ఆ కొద్ది బలం తోనే రాష్ట్రంలో మరింత బలపడాలని చూస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలే లక్ష్యంగా బాబు పక్కా ప్రణాళికతో సాగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా తెలంగాణలో కూడా పర్యటిస్తూ టీడీపీ రేస్ లో ఉందనే సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. ఇక తాజాగా టి టీడీపీ నేతలతో నేడు భేటీ కూడా అయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీలో టి టీడీపీ నేతలకు బాబు ఎలాంటి సూచనలు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మళ్ళీ సిఎం కేసిఆరే.. వారికి ముందే తెలుసా ?
ఎందుకంటే ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ పొత్తుకు సంబందించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కూడా టీడీపీ మద్దతు బీజేపీకి ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ అలాంటిదేమీ లేదని ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. అయితే టీడీపీ నుంచి మాత్రం ఖండించడం గాని సమర్థించడం గాని జరగలేదు. దాంతో ఇంకా పొత్తు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అందువల్ల భేటీ అనంతరం పొత్తు కు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి. అలాగే తెలంగాణలో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడం వల్ల ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ? ఎవరెవరికి సీట్ల కేటాయింపు జరపాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో బాబు చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలను కూడా బ్యాలెన్స్ చేసేందుకు చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..